Tuesday, May 3, 2011

ఓ కార్మికుడా

ఓ కార్మికుడా

రక్తాన్ని మరిగించి
స్వేదాన్ని పారించి
సేద్యాన్ని పూయించిన వాడా
నరాలు బిగించి
కండల్ని కరిగించి
నాగరికతకి నగిషీలు చెక్కిన వాడా

ఊపిరితిత్తుల్లో చీకటి నింపుకుని
లోకానికి వెలుగులు పంచేవాడా
భూమి పొరల్లో రహస్యాలు చేదించి
బొగ్గు గనిలో బుగ్గైన వాడా

అభివృద్దికి బాటలు వేసేవాడా
ఆర్థిక ప్రగతికి ఆయువుపట్టైన వాడా
అయినా...
హక్కుల కోసం నిరంతరం పోరాడేవాడా
అర్దాకలి తో అలమటించే అమాయకుడా

విశ్వ మానవ వికాసానికి కంకణం కట్టుకున్న వాడా
వ్యక్తిగతమన్నది మరచి వ్యవస్తకి అంకితమైన వాడా
పని పిపాసీ, యంత్ర సహవాసీ
శ్రమ జీవన సౌందర్యాభిలాషీ
ఓ కార్మికుడా

-- కార్మిక సోదరులందిరికి మే డే శుభాకాంక్షలు