Tuesday, October 7, 2014

వాడు


మనువుని మించిన వేథావి
మనిషికీ మనిషికీ మద్య
మనసుకీ మనసుకీ మద్య
నెత్తురుకీ నెత్తురుకీ మద్య
విశాలమైన దూరాలు ఏర్పరిచి
ద్వేషాన్ని సాగు చేస్తుంటాడు.
వాడు
మతాన్నో, ప్రాంతాన్నో, భాషనో,
దేవుణ్ణో లేక దేశ భక్తినో
మత్తు మందుగా చేసి
తన మాటలలో దట్టంగా నింపి
ఒకే సారి కొన్ని లక్షల మెదళ్లని
మాస్టర్బేట్ చేస్తుంటాడు.
చాలా తెలివిగా, ప్రణాళికా బద్దంగా
ఆ మెదళ్లని ఆర్గాజానికి తీసుకెళ్లి
పగని స్కలింపజేస్తాడు.
ఆ విద్వేషపు జ్వలనంలో
తగలబడుతున్న శవాల
కవురు వాసనని కమ్మగా పీల్చుకుని
మరోచోట నెత్తుటి కూడు కోసం
నింపాదిగా బయలు దేరతాడు.

--శ్రీ 5/10/2014

1 comment:

  1. విద్వేషాల్ని రెచ్చగొట్టేవాళ్ల పోలికల్ని బాగా వర్ణించారు, సూపర్!

    ReplyDelete